3 నవంబర్, 2008

తెలంగాణ చరిత్ర






భారత దేశానికి ప్రపంచం లో ఎంత చరిత్ర కలదో తెలంగాణ కు కూడా అంతే చరిత్ర కలదు. చరిత్ర ఏమిటంటే..... !
వివాహాది శుభ కార్యాలలో బ్రహ్మనోత్తములచే
"
జంబూద్వీపే భరత ఖండే దక్షిణ పదే అస్మకం" అనే శ్లోకం వింటునే వుంటున్నాం అస్మక ప్రాంతమే తెలంగాణా ప్రాంతం .

కృత యుగం (వేదకాలం) లో జంబూద్వీపం నుండి హిమాలయాలకు వెళ్ళే ఋషులు ఆర్మూర్ లో ని నవ నాథుల సిద్ధుల గుట్ట వద్ద ,మునులు మొర్తాండ్ మండలం లో ని మునుల గుట్ట వద్ద విశ్రాంతి తీసుకొని హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకునేవారు.ఇలాంటి ప్రాంతాలు తెలంగాణ లో కలవు.

త్రేతాయుగం
లో ప్రాంతం దండకారణ్యం గా పిలువ బడేది. యుగం లో శ్రీ రాముడు ,సీతమ్మ,లక్ష్మణులసమేతంగా అయోధ్య నుండి త్రివేణి సంగమం నాకు వచ్చినారు.ఆనతి త్రివేణి సంగమమే నేటి రెంజల్ మండలం లోని కందకుర్తి గ్రామము. త్రివేణి సంగమ్మ తెలంగాణా లో వుండడం తెలంగాణా వారికెంతో పుణ్యఫలం . శ్రీరాముడు ,సీతమ్మ,లక్ష్మణులు గోదావరి నది తీరం వెంబడి వెళ్తు ఖమ్మంలోని భద్రాచలం లో కొలువైనారు. అదే కాలం లో రత్నాకరుడనే గజ దొంగ నారదుని చేత జ్ఞానోదయం పొంది వాల్మీకి మారి రామాయణ మహా కావ్యాన్ని రచించాడు .అతడు జ్ఞానోదయం పొందిన ప్రాంతమే నవీపేట్ మండలం లోని కస్పబినోల గ్రామము. నేటికి ఇచ్కాత వాల్మీకి సమాది కలదు.అతడు "కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహా పురుషు లావు తారు" అనే వాక్యం నిజం చేసినారు. వాల్మీకి తెలంగాణా ప్రాంత వాసి కావడం ప్రాంత ప్రజల కెంతో గర్వ కారణం.

ద్వాపర
యుగం లో పాండవులు హస్తినపురం (డిల్లీ) నుండి అజ్ఞాత వాసం లో దక్షిణ భారత ప్రాంత మైన అస్మకం చేరినారు. ప్రాంతం లో బకసూరుడనే రాక్షసుడు తిని,త్రాగి ప్రజలను హింసిస్తుండే వాడు. రాక్షసుణ్ణి భీముడు చంపినాడు. నాటి ప్రాంతమే నేటి భోధన్ లోని రాకాసి పేట్. నేడు దీనిని భీముని గుట్ట అంటున్నారు. పాండవులు ప్రాంతం రావడం ఇక్కడి వారి అదృష్టం . ఇదే యుగం లో మహా భారత రచయిత వ్యాస మహర్షి కాశి నిండి తీర్ద యాత్రలు చేస్తూ అస్మకం ప్రాంతం చెంత గోదావరి తీర ప్రాంతమందు జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీ మాత ని ఆదిలాబాద్ లో ప్రతిస్తాపన చేసినారు. నాటి వ్యాసపురి ఐన వాసర క్షేత్రం నేడు బాసర ప్రసిద్ది చెందినది. వ్యాసుడు తెలంగాణా ప్రాంతం లో జ్ఞాన సరస్వతీని ప్రతిస్తాపన చేయడం తెలంగాణా ప్రజల కు మహా వరం లాంటిది.

క్రీ.పూర్వము 6 శతాబ్దము గౌతమ బుద్దుని పరిపాలనలో అఖండ భారత షోడశామహజన పదా(౧౬ రాజ్యాలు) లతో ఆర్థిక రాజకీయ నైతిక మరియు సాంస్కృతిక రంగాలలో అత్యంత వైభవంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండేది . షోడశ మహా జన పదాలుగాంభోజ,గందార,కురు,మత్స్య,శూరుసేనా,పాంచాల,కోసల,మల్ల,చెడి,వాత్స్య,కాశి,వజ్జీ,అంగ,మగధ, అంతి మరియు అస్మక ౧౬ జాణ పదాల లో ౧౫ ఉత్తర భారత దేశం లోఉంటే అందులో ఒకే జానపదం "అస్మక" దక్షిణ భారత దేశం లో గోదావరి కృష్ణ నదుల మద్య ఉండేది. ప్రాంతపు గొప్ప పరిపాలన గురించి గ్రీకు రాజి అలెగ్జన్దర్ రాయబారి మొగస్తానీసు తనచే వ్యాయబడిన "ఇండికా" అనే గ్రంధం లో పేర్కొన్నారు. అస్మక ప్రాంతం అపారమైన జల వనరులు౯చఎరువులు) విస్తారమైన అటవీ సంపదతో నా తెలంగాణా కోటి రతనాల వీణా గా చరిత్రలో నిలిసినది. ఇతర దేశాలైన గ్రీకు,రోమ్,చైనా,మోసపోతేమియా,హిబ్రూ,జేరుసాలెం లాంటి ప్రపంచదేశాలతో స్నేహ సంభందాలు ఏర్పాటు చేసుకున్నది.

ఆసియా
ఖండం లో నే అతిపెద్దధైన నిజాంషుగర్ ఫ్యాక్టరీ వ్యవసాయంలో అగ్రగామి ఉండేది . చారిత్రాత్మక కట్టడాల తో పాటు హిందూ, జైన, బౌద్ధ, ఇస్లాం మతాలతో భిన్నత్వం లో ఏకత్వంగా ఉండేది. భౌగోళిక పరంగా ప్రాంతం "దక్కన్' ప్రాంతం వర్ణించబడింది.ఉర్దూ లో దక్కన్ అంతే మూట లేదా ఎత్తైన ప్రాంతం . నాటి నుంచి నేటి వరకు తెలంగాణా ప్రాంతంలో అనేక ఉర్దూ పదాలు (దావఖాన,సడక్,) అగుపడుతున్నవి. అలాంటి ఒక ఉర్దూ పదమే "లష్కర్" .లష్కర్ అంతే తెలుగు లో సైనిక స్థావరం,ఇంగ్లీష్ లో "కంటోన్మెంట్"

స్వాతంత్ర్యానికి
పూర్వం యావత్ భారత దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తునతే ఆపారమైన వనరులున్న దక్కన్ ప్రాంతాన్ని నైజాం పరిపలిస్తుండే వాడు . దక్కన్ ప్రాంతాన్ని ఆంగ్లేయుల ఆదినం లో కి వెళ్ళకుండా నైజాం తన సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని సికింద్రాబాద్ ప్రాంతాన్ని లష్కర్ ప్రాంతం ఏర్పాటు చేసినాడు.లష్కర్ అంటేనే సైనిక స్థావరం . సైన్యం లో ఉన్నా సైనికులు తమ విధి నిర్వహణలో నిర్భయంగా ఉండాలి . నిభాయత్వం సింహం లో అగుపడుతున్నది.సింహం మహంకాళి యొక్క వాహనం కావున సైన్యం లోని ప్రతీ సైనికుడు సింహం లాగ ఉండడానికి మహంకాళి ని పూజించారు. బోనం అంటే ఘటిక తో తయారు చేయబడిన ప్రసాదం. నాటి లష్కర్ సికింద్ర బాద్ లోని మహంకాళి కి బోనం పెట్టి లష్కర్ బోనాల పండుగ జరుపుకొని ఆంగ్లేయుల పాలనను అడ్డుకున్నారు.

స్వాతంత్ర్య
అనంతరం ౧౯౫౫ లో యావత్తూ భారత దేశం లోని అగ్ర గామిగా ఉన్నా తెలంగాణా ప్రాంతం పై ఆంద్ర నాయకుల కన్ను పడింది. నాటి రాజకీయ నాయకులు అమాయకురాలైన అమ్మాయిని (తెలంగాణా) గడసరి అబ్బాయితో( ఆంధ్ర) తో పెళ్లి చేస్తున్నాను. కలిసి ఉంటేవున్దవచ్కూ లేదా విడిపోవచ్చు అంటు ఆంధ్రా తెలంగాణా ప్రాంతాలను కలుపుతూ విశాలంద్రాగా మార్చినారు . ౧౯౫౬ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు లక్షల ఉద్యోగాలు కొల్పొఇ యువతీ యువకులు పెడదారి పడుతున్నారు .

నక్సలైట్లు
గా మారుతున్నారు. ఉద్యో గాలు లే బతుకు జీవుడా అంటూ. గల్ఫ్ ప్రాంతం వెళ్లి బానిస బతుకులు బతుకుతున్నారు . అన్నదాతలు ఉండవలసిన రైతన్నలు అప్పులు తీర్చలేక అన్నమో రామచంద్ర అంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

నా తెలంగాణా కోతి రతనాల వీణా వున్నా ఉన్నా ప్రాంతం లో నేడు నిత్య జరుగు తున్న చరిత్ర ఇది . అందుకే మనమందరం కుల, మాట రాజకీయాల కు అతీతం గా తెలంగాణా రాష్టం ఏర్పాటుకు కట్టుబడి తెలంగాణా రాష్ట్రాన్ని సాదించుకుందాం ..!



జై
తెలంగాణ! జై జై తెలంగాణ!!




- నల్ల చంద్ర స్వామి

5 కామెంట్‌లు:

  1. chal baga undhi ne prayathnam inka chala manchi post lanu regular ga update chey

    రిప్లయితొలగించండి
  2. telangana prajalanu patti peedisthunna ee aandhravalasa paalakulanu thanni thanni tharii kottadaniki neevanthu ga entho kontha upayogapaduthundhi thammudu idhi jai telangana jai jai telangana

    రిప్లయితొలగించండి
  3. baratha dhesha charithraku telangana charithra e mathram theesipodhani vivarinchina anna neeku naa johar telangana dhandaalu maa vooriki ra kallu thraagudham dhasara naadu bahu kushi cheddhaam

    రిప్లయితొలగించండి
  4. అది తెలంగాణ చరిత్ర జై తెలంగాణ జై జై తెలంగాణా

    రిప్లయితొలగించండి
  5. మన తెలంగాణ చరిత్ర ను ఎక్కడ కనిపించకుండా మనల అనగ ద్రొక్కిన ఈ వలసవాద ఆంద్ర పాలకులు మన తెలంగాణ ను విడిచి వెల్లే కాలం త్వరలోనె వస్తుంది

    రిప్లయితొలగించండి