
తెలంగాణా రాష్ట్ర సాధన కర్తవ్యాలు
ఇది జాతీయ పోరాటం
ఇది ధర్మ పోరాటం
ఇది తెగాతేంపుల సంగ్రామం
తెగిస్తేనే తెలంగాణా సాధ్యం
"విద్యార్థి యువశక్తి తోడైతేనే
నిజమవుతుంది తెలంగాణా స్వప్నం"
ప్రస్తుతం అన్ని రీతుల తెలంగాణా ప్రజలు వుద్యమించాలి. ఆ దిశగా నాయకులు,మేధావులు.ముఖ్యంగా విధ్యార్థులు ప్రజాశక్తులను కదిలించాలి. విద్యార్థులు పాలు పంచుకోన్నప్పుడు వుధ్యమమ పెను ఉప్పెనగా మారుతుంది ఐతే ఇపుడు కావలసింది ఆలోచనా రహితమైన ఆవేశం కాదు వ్యుహత్మకంగా అడుగులు కదపటం ఈనాటి అవసరం. ఇంకా తెలంగాణా వాదం చేరని మూలాలకు ఉద్యమాన్ని విస్తరించాలి.
తెలంగాణా ఏర్పాటుకు వ్యతిరేకించే రాజకీయ పార్టీలకు,నాటకులకు పుట్టగాతులుందని సామాజిక సందర్భాన్ని సృష్టించగాలగాలి అదే మనం తెలంగాణా అమరవీరులకు అరించే నిజమైన నివాళి .
ఔను ఇది నిజం చరిత్ర చెప్ప్పిన సత్యం ప్రపంచం లో విజయ భావుటా ఎగురవేసిన
ఎ ఉద్యమం చూసినా అక్కడ యువత ,విద్యార్థుల దే బలం వారి పోరాట ఫలమే జయ జయ ధ్యానం. ఆ భాద్యత ఇప్పుడు తెలంగాణ యువశక్తి మీద పాడించి.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రాజీలేని సమరం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ౫౦ ఏళ్ళ ఆంద్ర పాలన లో తెలంగాణా కు ఒరిగిందేమిటి? దారి లేని వూళ్ళు ,నోళ్ళు పగిలిన భీల్‌లు, దొంగల పాలవుతున్న నదీ జలాలు, వలస వచ్చిన వారికీ వుద్యోగాలు.
మనం వుధ్యమిస్తున్నది ఎవరి మీద కక్ష తో కాదు. ధగ పడుతున్న మన బతుకులు నాగు చెస్‌కు కోవడానికి !చరిత్ర,వర్తమానం మానాలు తేలియన్దేమి కాదు ! కోస్తా కార్పోరేట్ కాలేజీలు ఇక్కడ రాజ్య మేలుతున్నాయ్, ఆపై వలస వచ్చిన వాళ్ళే ఇక్కడి లక్షల ఉదోగాల్లో పాగా వేస్తున్నారు. ఇదేం అన్యాయం అని అడిగితే కంటి నీరు తుడవడానికి అన్నట్లు ౬౧౦ జి. వో ముందుకు తెచ్చారు. దాని అమలు తీరూ మోసం పూటకో,మాట తో మూడు దశాబ్దాలు అయినా ఆ జీ.వో అమలు కాలేదు ఇదీ పాలకుల నైజం.
స్థానికేతరులు లేనే లేరు అని మొన్న అన్నారు. కాదు ౭,౦౦౦ మంది అని నిన్న అన్నారు ,కాదు ౨౫,౦౦౦ అని ఈరోజు అన్నారు . ఇలా పూటకో లెక్క చెబుతున్నారు. ఇక్కడ ఉదోగం చేస్తున్న వారిలో స్థానికేతరుల సంఖ్య ౪ లక్షలు దాటిందని మనందరికీ తెలిసిన నగ్న సత్యం. తెలంగాణా రాష్ట్ర మేర్పడితే ౪ లక్షల ఉదోగాలు మనే పొంధవ్చ్చ్సును. ౧౨,౦౦౦ గ్రామలున్న తెలంగాణా ప్రాంతం లో ప్రతి ఊరికి ౩౫ ఉద్యోగాలు వస్తాయి .
ఇది తెలిసిన తెలంగాణ మేధావులు, ఉద్యోగ సంఘాలు ,కళాకారులు,ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని గుర్తించారు. తెలంగాణ వాదం పై గళమెత్తారు. ఆ ఉద్యమానికి మన మంత జత కలిస్తే ఉద్యమం నానాటికి ఉధృతం అవుతుంది.
ఈ సమరం లో తెలంగాణ విద్యార్థి మేధావులంతా కేలక భూమిక పోషించాలి . ఉద్యమాన్ని వ్యుహతంకంగా నడపాలి . ప్రతి విద్యార్థి మేధావి, యువకుడు ప్రతేక తెలంగాణ ఆవశ్యకతను గుర్తించాలి, చరిత్ర వర్తమానం పై అవగాహనా పెంచు కోవాలి ప్రతి ఇంతా,ప్రతి వీధి లో , ప్రతి ఊళ్ళో తెలంగాణా పై చర్చ సాగించాలి . ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర మొదలు పెట్టి ప్రతి ఒక్కరికి తెలంగాణకు జరుగు తున్న అన్యాయంవివరించాలి ..... ఈ ధర్మ ప్రజాస్వామ్య పోరాటం లో విజయాన్ని సాధించాలి
ఇది వంచన మీద పోరాటం
వివక్ష మీద పోరాటం
ఇది తెగాతేంపుల సంగ్రామం
తెగిస్తేనే తెలంగాణ సాధ్యం!
జై తెలంగాణా! జై జై తెలంగాణా!
-నల్ల చంద్ర స్వామి
telangana yuvakula is very nice
రిప్లయితొలగించండిgood try try and make ..good articles
రిప్లయితొలగించండి